'వాసుపల్లి జానకీరామ్‌పై చర్యలు తీసుకోవాలి'
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అసోసియేషన్ కార్యాలయంపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడిన వాసుపల్లి జానకీరామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. పదవీకాలం ముగిసినా జానకీరామ్ అక్రమంగా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరికాదన్నారు.