హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన పోలీసులు
ASF: కౌటాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని వరద నదిలో లోతైన ప్రదేశంలో స్నానాలు వెళ్ళకూడదని కౌటాల SI చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నది ఒడ్డున హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. వరద నది ప్రవాహక ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డు ను ఏర్పాటు చేసినట్టు SI తెలిపారు.