ఖమ్మం జిల్లాలో 21 బెల్ట్ షాపులు సీజ్: కలెక్టర్

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో రూ.1,69,904 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, 21 బెల్ట్ షాపులను సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. జిల్లాలోని పలుచోట్ల చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.