2047 అంచనాలతో సీవరేజ్ డిజైన్..!
HYD: నగరం ORR వరకు లోపల బయట ఉన్న ప్రాంతాలను సైతం జలమండలిలోకి రావటంతో విస్తీర్ణం భారీగా పెరిగింది. అయితే ఆయా ప్రాంతాల్లో సీవరేజ్ నెట్‌వర్క్ అంతగా లేదు. దీనిని గుర్తించిన జలమండలి 2047 వరకు నగరంలో పెరిగే జనాభా ప్రాతిపదికన డీటెయిల్డ్ డ్రైనేజీ సిస్టం ప్లానింగ్ రూపొందిస్తున్నట్లుగా తెలిపింది. ఈ సిస్టం పూర్తి చేయడానికి వేలాది కోట్లు ఖర్చు కానుంది.