ఆదర్శ ఉద్యోగులకు అవార్డులు అందజేసిన సీఐ

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో ఉత్తమ సేవలు అందించి ఆదర్శంగా నిలిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రధానోత్సవం శుక్రవారం నిర్వహించారు. సీఐ వెంకట్ రెడ్డి హాజరై ఆదర్శ ఉద్యోగులుగా అవార్డులు అందజేసి అభినందనలు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రయాణికులకు ఇదే స్ఫూర్తితో ఉత్తమ సేవలు అందిస్తూ ముందుకెళ్లాలన్నారు. డీఎం రమేష్ బాబు, పాల్గొన్నారు.