పాముకాటుతో మహిళ మృతి

పాముకాటుతో మహిళ మృతి

కోనసీమ: ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేలంక గ్రామానికి చెందిన మహిళ పాము కాటుతో మృతిచెందింది. పులిదిండి గౌరీదేవి(32) ఇవాళ తమ నివాస గృహం ఎదురుగా ఉన్న తోటలో పడిన కొబ్బరి ఆకు తీసేందుకు వెళ్లగా పాము ఆమె కాలుపై పలుమార్లు కాటు వేసింది. స్థానికులు వెంటనే ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించే లోపే మృతిచెందిందని స్థానికులు తెలిపారు.