సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

కరీంనగర్: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, యువత సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహల్ సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు, చిత్రాలు షేర్ చేయవద్దని కోరారు. అనవసర మెసేజ్‌లు పెట్టి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. యువత కేసులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.