క్రీమీలేయర్ లెక్క మారాల్సిందే: సుప్రీం
OBC కోటాలో క్రీమీలేయర్‌ను కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగానే నిర్ణయించకూడదని, ఉద్యోగ హోదాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.8L దాటిన వారిని క్రీమీ లేయర్‌గా పరిగణించి రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తున్నారు. అయితే, కేవలం ఆర్థిక అంశాలే కాకుండా సామాజిక హోదాను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని SC కీలక వ్యాఖ్యలు చేసింది.