VIDEO: రహదారి పైన వాహనాల నిలుపుదల
SRPT: అనంతగిరి నుంచి చనుపల్లి –పాలవరం రహదారిపై వరి కోత యంత్రాలు, లారీలు, ట్రాక్టర్లు నిలిపివేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రహదారిపై వాహనాల నిలుపుదలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.