నగరంలో రేపు జాబ్ మేళా
KRNL: నగరంలోని శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 14 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు.