నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

మేడ్చల్: శామీర్ పేట చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి శుక్రవారం పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, భక్తులకు, ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. మరోవైపు చెరువులో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.