దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

SDPT: దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన రత్నాగారి లత కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో సుమారు 7.1 కిలోల బరువున్న మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు.