అకాల వర్షంపై స్పందించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

అకాల వర్షంపై స్పందించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

SDPT: దుబ్బాక నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ఈ పరిణామం పట్ల త్వరితగతిన స్పందించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. రైతుల పంట నష్టం తీవ్రతను అంచనా వేయించి, వారికి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.