VIDEO: శివాలయంలో విశేష పూజలు
CTR: మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మొదట లింగాన్ని ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత రుద్రాభిషేకం, బిల్వ పత్రాలతో అర్చనలు శైవాగతం ముక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు.