కరెంట్ షాక్‌తో ఎలక్ట్రిషియన్ మృతి

కృష్ణా: చల్లపల్లి మండలం యార్లగడ్డలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఎలక్ట్రిషియన్ బండారు బుజ్జిబాబు(48) కరెంట్ స్తంభం ఎక్కి సర్వీస్ వైరు సరిచేస్తూ విద్యుదాఘాతానికి గురై కాంక్రీట్ దిమ్మపై పడి మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.