మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన మంత్రి
AP: ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.