సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఎంవీపీ కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను అందజేశారు. పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.