ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రజల ప్రాణాలతో చెలగాటం

GNTR: నగరంలోని హిమాని నగర్ జెండా చెట్టు వద్ద విద్యుత్ స్తంభం ఆ శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత ఆరు నెలలుగా విద్యుత్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్ బాక్స్ ఒరిగిపడి ప్రమాదకరంగా వేలాడుతున్నా.. విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని మరమ్మతులు చేయాలని విద్యుత్ శాఖను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.