విశాఖలో నేడు మాంసం ధరలు
విశాఖపట్నంలో ఆదివారం మాంసం ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ. 950కి, చికెన్ స్కిన్ లెస్, రూ. 280కి, విత్స్కిన్ రూ. 250కి, శొంఠ్యాం కోడి రూ. 300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ. 66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.