టీడీపీ ప్రమాద బీమా రూ. 5లక్షలు అందజేసిన నగిరి ఎమ్మెల్యే
TPT: వడమాలపేట(M), ఎస్.బీ.ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముద్దులూరు నరసింహులు రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వీరు టీడీపీ సభ్యత్వం తీసుకుని ఉండడంతో కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి ప్రమాద భీమా కింద రూ. 5 లక్షల మంజూరు పత్రంను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారి సతీమణికి అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.