రాజా మాతాంగి అలంకారంలో జగదాంబ అమ్మవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో శ్యామల నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు ఆంజనేయ శర్మ అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారు రాజ మాతంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.