చౌడేపల్లెలో పాముకాటుతో రైతు మృతి

చౌడేపల్లెలో పాముకాటుతో రైతు మృతి

చిత్తూరు: పాముకాటుతో రైతు చనిపోయిన ఘటన చౌడేపల్లె మండలంలో వెలుగు చూసింది. గోసులకురప్పల్లె గ్రామానికి చెందిన రైతు గురుస్వామి కుమారుడు చిన్నరెడ్డెప్ప (35) ఇంటిలో నిద్రిస్తుండగా పాముకాటేసింది. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.