ఫ్లైఓవర్ ప్రమాదకర నిర్మాణాల మరమ్మతుకు సీపీఎం డిమాండ్

ఫ్లైఓవర్ ప్రమాదకర నిర్మాణాల మరమ్మతుకు సీపీఎం డిమాండ్

KRNL: ఆదోనిలో ప్రమాదకర స్థితిలో ఉన్న పాత ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా మారిన వీధిలైట్ల స్తంభాన్ని వెంటనే మార్చాలని సీపీఎం డిమాండ్ చేసింది. అలాగే కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రహరీ గోడ మరమ్మతు పనులు చేపట్టాలని సోమవారం మునిసిపల్ కమిషనర్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ నిర్మాణాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాన్నారు.