జన విశ్వాస్ బిల్లుపై ప్రధాని మోదీ హర్షం

జన విశ్వాస్ బిల్లుపై ప్రధాని మోదీ హర్షం

పార్లమెంట్‌లో ‘జన విశ్వాస్(సవరణ) బిల్లు 2026’ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లకు భారీ ఊతాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. పాతబడిన నిబంధనలను తొలగించి, విశ్వాస ఆధారిత పాలనను ఇది బలపరుస్తుందన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ బిల్లును రూపొందించడం విశేషమన్నారు.