ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు
అన్నమయ్య: జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారి తేజేస్విని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాళ్ళపాక వేణుగోపాల్, తదితర సగర సంఘం నాయకులు పాల్గొన్నారు. భగీరథ మహర్షి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి బీసీలు ఐక్యంగా ఉండాలన్నారు.