నకిలీ పత్రాలతో భూకబ్జా.. ఆరుగురి అరెస్టు
KNR: కరీంనగర్‌లో నకిలీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఖాళీ ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని, యజమానుల వివరాలతో నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించి క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పద్మనగర్‌లోని ఓ స్థలాన్ని ఇదే రీతిలో కబ్జా చేసిన నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.