'పింఛన్ల పంపిణీలో జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం'
VZM: భీమవరంలో NTR భరోసా పింఛన్లను ఇవాళ బాడంగి MPDO శంబంగి రామకృష్ణ, బుడా ఛైర్మన్ తెంటు రాజాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా 8,244 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 6201 పింఛన్లు పంపిణీ పూర్తి చేసి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.