VIDEO: జమ్మూ లేఅవుట్ వద్ద నాగుపాముల సయ్యాటలు

SKLM: నరసన్నపేట మండలం జమ్మూ లేఅవుట్ వద్ద నాగుపాములు విపరీతంగా సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక లేఅవుట్ ప్రాంతంలో నాగుపాము, జెర్రిపోతూ సయ్యాటలాడటం కనిపించింది. సుమారు గంటకు పైగా రహదారి పైనే అవి ఉండటంతో అటు పక్క వెళ్లేందుకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రి వేళల్లో అటు వెళ్లాలంటే జంకుతున్నారని తెలిపారు.