జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులు
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 1500 మంది నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిని కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు.