VIDEO: రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఛైర్మన్
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. గురువారం జామా మసీద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన కిట్లను పేద ముస్లింలకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని ఛైర్మన్ తెలిపారు.