నర్సీపట్నం: ముగ్గురు వాలంటీర్లు తొలగింపు

విశాఖ జిల్లా: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై గొలుగొండ మండలంలో వైదేహి సంతోషి, చిటికెల శ్రీను, పరవాడ సురేష్ లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సూచనలు అనుసరించి, RDO జయరాం దృష్టికి తీసుకువెళ్లి ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. కాగా గొలుగొండ మండలంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన జెండా దిమ్మెల నుంచి జెండాలను తొలగించామని పేర్కొన్నారు.