కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ

చిత్తూర్: ఐరాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. ఆలయంలోని క్యూ లైన్‌లన్నీ భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.