మేడిపల్లి ACPగా మోహన్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
MDCL: మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి డివిజన్‌కి నూతనంగా నియమితులైన మోహన్ కుమార్ ACPగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ ACPగా పనిచేసిన ఆయన మేడిపల్లి ACPగా నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ శాఖ పని తీరును మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.