ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
NGKL: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 45 దరఖాస్తులను స్వీకరించారు. వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.