VIDEO: శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

KRNL: పత్తికొండలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. మూల విరాట్, నందీశ్వరుడికి పాలు, పంచామృతంతో అభిషేకాలు చేశారు. పసుపు, కుంకుమ, భస్మం, చందనంతో లింగార్చన నిర్వహించారు. ఆలయ పూజారి విజయ స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, భక్తులకు చిట్టెం వీరన్న శెట్టి, వల్లంకొండ ఈరన్న శెట్టి దంపతులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.