VIDEO: వైభవంగా పాండురంగ రుక్మిణి కళ్యాణం
SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం గజేంద్ర ఆశ్రమంలో ఇవాళ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగ కళ్యాణ మహోత్సవం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఆచార సంప్రదాయ ప్రకారంగా కార్యక్రమాలు జరిపారు. మండలం ప్రజలే కాకుండా పక్కనే ఉన్న కామారెడ్డి, నిజాంబాద్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, అవధూత్, జ్ఞానేశ్వర్ మహారాజ్‌లు ఉన్నారు.