బస్సు లారీ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ మృతి

WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఎస్సారెస్పీ కెనాల్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కిష్టయ్య మృతి చెందారు. కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ప్రమాదంలో మరికొందరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.