కొత్తూరులో కంటి వైద్య శిబిరం
SKLM: కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు జానకిరామయ్య స్థానికులకు కంటి పరీక్షల నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను సరఫరా చేశారు. శాస్త్ర చికిత్స నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.