VIDEO: 'రోడ్డు భద్రత నియమాలను పాటించాలి'
MNCL: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని బెల్లంపల్లి ACP కిరణ్ కుమార్ సూచించారు. మంగళవారం వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలన్నారు.