జిల్లాలో 34 బైక్‌లు సీజ్..

జిల్లాలో 34 బైక్‌లు సీజ్..

NLR: నగరంలోని పలు ప్రాంతాలలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. సోమవారం నవాబుపేట టూ టౌన్ పరిధిలోని బోడిగాడి తోట, బర్మాశాల గుంట, అహ్మద్ నగర్ తదితర ప్రాంతాలలో సీఐ వేణుగోపాల్ రెడ్డి, సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని రెండు ఆటోలు, 34 బైక్‌లను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.