పన్ను బకాయిలపై రాయితీ
CTR: పలమనేరు పురపాలక సంఘం ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి శుభవార్త చెప్పారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50% వడ్డీ మినహాయింపును ప్రకటించారు. దీని వలన చెల్లింపుదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.