తలకు నూనె రాయట్లేదా?
గజిబిజి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎదురవుతున్న సమస్యల్లో జట్టు రాలడం కూడా ఒకటి. ఈ క్రమంలోనే చాలా మంది చుండ్రు, పొడిబారిన జట్టు, చిట్లిన కేశాలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తలకు వారంలో ఒక్కసారైనా కొబ్బరి నూనె లేదా బాదం, ఆలీవ్ ఆయిల్ రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో కుదుళ్లకు రక్తప్రసరణతో పాటు కేశాలు కూడా బలోపేతమవుతాయని చెబుతున్నారు.