'పది' పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
JGL: పదో తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొలాస జడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ తనిఖీలను సమీక్షించారు. విద్యార్థులకు తాగునీరు, వెలుతురు, శౌచాలయాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు.