మానవత్వం చాటుకున్న మిత్రబృందం
NLG: హాలియా ఒకటో వార్డుకు చెందిన లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమారుడు మల్లేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న మిత్రులు అండగా నిలిచారు. తమ సొంత ఖర్చులతో లక్ష్మమ్మ దశదిన కర్మ (పెద్దకర్మ) కార్యక్రమాన్ని నిర్వహించి ఉదారత చాటుకున్నారు. "మాధవ సేవే మానవ సేవ" అని నిరూపించిన స్నేహితులకు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.