నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్
ప్రకాశం: తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మీడియాతో మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ 20 సెంటీమీటర్ల వర్షం నమోదైందని ఫలితంగా వాగులు, వంకలు ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు.