డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "అరైవ్ అలైవ్ "కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవర్చుకోవాలని సూచించారు. 200 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.