VIDEO: నేలకొండపల్లిలో దంచికొట్టిన వర్షం
KMM: నేలకొండపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. 3 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. ఆ వెంటనే దట్టమైన మేఘాలు అలుముకోవడం, కాసేపటికి భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. కురిసిన భారీ వర్షానికి జన జీవనం కాసేపు పూర్తిగా స్తంభించిపోయింది.