కోర్టులకు నేటి నుంచి హాలిడేస్

HYD: జిల్లాలో కోర్టులకు ఈ రోజు నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మే 5 - జూన్ 6వ తేదీ వరకు సిటీలోని న్యాయస్థానాలు పనిచేయవు. నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టులు, ప్రిన్సిపల్ సీబీఐ స్పెషల్ కోర్టులకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యవసరమైన కేసులతో బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఇంఛార్జి జడ్జిలు విధులు నిర్వహిస్తారు. ఫ్యామిలీ కోర్టుకు మాత్రం సెలవులు లేవు.