'సురవరం మృతి దేశానికి తీరని లోటు '

TPT: మాజీ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి దేశానికీ తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఏ. రామానాయుడు తెలిపారు. శనివారం ఆయన గూడూరు సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. పీడిత వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటాలు సాగించిన యోధుడు సురవరం పేర్కొన్నారు.