ఆ రూట్‌లోనే 200లకు పైగా మరణాలు!
HYD: హైదరాబాద్-బీజాపూర్ హైవే పనులు 2022లో శంకుస్థాపన చేసినప్పటికీ, రెండు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. పర్యావరణంపై NGTకి పిటిషన్ రావడంతో ఈ హైవే పనులు నిలిచాయి. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, ఈ ఆలస్యం వల్ల నిన్నటి మీర్జాగూడ ప్రమాదం వంటి అనర్థాలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్గంలో 200 మందికి పైగా మరణించడం ఆందోళన కలిగిస్తుంది.